గతంలో సైనికశక్తి, ఆర్దిక శక్తి ప్రపంచాన్ని శాసించి ఉండవచ్చుగాని, 21వ శతాబ్దంలో 'నోలేద్జే' మాత్రమే ప్రపంచాన్ని ససిన్చానున్నది. విద్యకు, విజ్ఞానానికి విలువ అపారంగా పెరిగింది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంలో యువతరం అగ్రభాగాన నిలవాలి. విద్యార్దులు, యువతరం కొత్త కొత్త ఆలోచనలు, భావనలు సేకరించడానికి, శాస్త్రీయ దృక్పదం పెంపొందిచుకోవడానికి, చేసిన చిన్నపాటి క్రుస్షి ఫలితమే ఈ గ్రంధ రచన ఆవిష్కారం.
ప్రతి విద్యార్ది, యువకుడు సృజనాత్మకంగా ఆలోచించే తత్వాన్ని ప్రోత్సహించడమే ఈ గ్రంథరచన ప్రధాన లక్ష్యం. ఆలోచించే తత్వమే జ్ఞానాన్ని ప్రోది చేస్తుంది. జ్ఞానం మనిషిని శక్తి సంపన్నుడిగా మారుస్తుంది. ఇందుకు ప్రేరణ, ప్రోత్సాహం అందించడానికి, సైన్సు పట్ల ఆసక్తి, అనురక్తి ఏర్పరచడానికి, శాస్త్రీయ దృక్పదం పెంపొందించడానికి ఈ చిరు ప్రయత్నం జరిగింది. పలు సైన్సు రంగాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలకు అవసరమైన పరిధిలో సమాధానాలు కూర్పు జరిగంది గ్రంధంలో.
Rs.175.00
In Stock
-
+