"భవబంధాలను ఛెదించుకో. బ్రహ్మానంద మందుకో! చిత్త వృత్తులను నిరోధించు. ఓ చంచల చపలచిత్తమా! నీలోని దైవాన్ని దర్శించు. తరించు, పరిమితులు లేని ఆత్మ స్వరూపుడవైన నీవు, ఆత్మతత్వాన్నెరుగుము. బ్రహ్మానందమొందుము. సుఖ సంతోష మూర్తివై మాయామోహాల భ్రాంతుల నుండి బయట పడుము. చిత్తచాంచల్యము వీడి బ్రహ్మానంద పరుడవై, శాశ్వత శాంతి మార్గమునొంది, తరించుము.

నిజానికి ఈ జగత్తు, దాని వ్యాపారములు మాయామయమే తప్ప, మాయాతీతము కాదు. కారణమది మహామాయ లీలా స్వరూపము కనుక, భిన్న మార్గాల తత్వము, విభిన్న మార్గల విశ్వము చూడటానికి చాలా వింతగా వుంటుంది. అయితే ఇందులో ఏది సత్యము? ఏది అసత్యము? "అంటే సమాధానం దొరకదు. ఎందుకంటే మనం వూహించే ఆ రెండూ ఒకటే కనుక విశాల వాప్త, ఆకాశము వలె అనంతము. ఆది మధ్యాంతరహితము నిజం చెప్పాలంటే శోక, కష్ట, నష్ట భూయిష్టమైన లోకం ప్రస్తుతం మనం చూస్తున్నాం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good