వేదాల్ని ఎలాగ చదివేది? అవి సంస్కృత భూయిష్టం అని ఏ నాడో విన్నాను కదా? నాకు ఆ భాషలో ఒక్క ముక్క కూడా రాదు కదా? దానికి తెలుగు అనువాదం కావలిసిందే కదా? అందుకే అప్పటి నుంచీ, సంస్కృత వేదాలకు తెలుగు అనువాదాల కోసం వెతుకులాటలు! దొరికినవేవో దొరికాయి. దొరికినంత వరకే చదవడం సాధ్యమైంది. చదివినంత వరకే దాన్ని ఇతరులకు కూడా చూపించాలనే ఆసక్తితో, ఈ పని మొదలై రాత్రింబవళ్ళూ జరిగింది.
4 వేదాలకు తెలుగు అనువాదాలు ఈ మూల నించి ఆ మూల వరకూ చదవకపోయినా, చదివినంత వరకూ, వేదాల్ని అర్థం చేసుకోవడానికి చాలు! ఇంకా చాలకపోయినా, ఇంకా మిగిలిపోయిన అద్బుతాలేవో అక్కడ వుండిపోయినా, ఆ చూడని అద్భుతాలు కూడా చూసిన అద్భుతాల వంటివే అవుతాయి. దొరికినవి చాలు! నేను ఏ వేదంలో ఎంత చదివానో తర్వాత చెపుతాను. నాకు ఏర్పడిన అభిప్రాయం ఎటువంటిదో కూడా చెపుతాను. ఈ వేద సాహిత్యాన్ని ఏం చెయ్యాలని నాకు తోచిందో చివర్లో వివరంగా చెపుతాను.
- రంగనాయకమ్మ
Pages : 216