నూరేళ్ల శశవిషాణం

కవి, విమర్శకుడు, చిత్రకారుడు, సంపాదకుడు

తొలి తెలుగు రాజకీయ కార్టూనిస్టు!!

తెలుగులో జర్నలిజం అధ్యయన కేంద్రానికి మొదటి  ప్రధాన అధ్యపకుడు

వేదాలను క్షుణ్ణంగా మథించిన మార్క్సిస్టు మేధావి

తెలుగునాడు తూర్పూ పడమరా తెలిసినవాడాయన

తెలుగువాడి వాడీ`వేడీ లోకానికి తెలిపినవాడాయన

కొత్తపాతల మేలుకలయికగా కలిసినవాడాయన

హైదరాబాద్‌ నగరం పొడుగూ వెడల్పూ కొలిచినవాడాయన

ఓ చేత కలాన్నీ, మరో చేత కుంచెనూ పట్టినవాడాయన

తత్వాన్నీ, మనస్తత్వాన్నీ కాచి వడగట్టినవాడాయన

చరిత్ర పాఠంగా చెప్పినవాడాయన

చరిత్రగా తానే మారినవాడాయన!

కొవ్విన నేతల కొమ్ములు వంచినవాడాయన

తిరిగి ‘కుందేటికొమ్ము’ సాధించినవాడాయన

ఆ రాంభట్ల కృష్ణమూర్తి శతజయంతి సంవత్సరమిది!! మార్చ్‌ 24, 2020

పేజీలు : 176

Write a review

Note: HTML is not translated!
Bad           Good