Rs.1,800.00
Out Of Stock
-
+
కలియుగం ప్రారంభమై 5108 సంవత్సరాలు. ఇంతవరకూ ఎవరూ వేదాలను సామాన్య ప్రజలకు అందించాలని సంకల్పించలేదు.
''ప్రజలకు వేదం'' అనే నినాదంతో సాహసించిన అద్వితీయుడు అక్షరవాచస్పతి.
సాంప్రదాయపు సంకెలలు త్రెంచి నాలుగు వేదాలను తెలుగు వెన్నెలవచనంలో అనుసృజించిన ఆద్యుడు దాశరథి.
ఇంకనూ రెండు బ్రాహ్మణాలు - పది ఉపనిషత్తులు - రెండు రామాయణాలు - భారతం - హరివంశం - భాగవతం సవ్యాఖ్యానంగా అనుసృజించిన అక్షరశిల్పి రంగాచార్య.
వీరి వచనం వెన్నెలవాగు సులభం - సుందరం, అక్షర దృశ్యాలు దర్శింపచేస్తుంది.
వేదాల్లోనే అన్నీ ఉన్నాయనేవాళ్ళూ, వేదాల్లో ఏదీ లేదనే వాళ్ళూ - ఇద్దరూ వేదాలను చదవలేదు అంటారు దాశరథి. అందుకే చరిత్రలో తొలిసారిగా నాలుగు వేద సంహితలను చక్కని తెలుగు వచనంలో మనకు అందించారు దాశరథి.