నాగేటి  చాలుల్లో  దాగిన సీతల్లారా...  దాటని గీతల్లారా...   
చట్టాలున్నా చలరేగని ఇతిహాసపు చీకటి శకుంతల్లారా!!
ఇంటి  హింసకు  ఇల్లెక్కి చాటటమే ఈనాటి  మార్గం!!   
హృదయాంతరంగ రాగ రాగాల సుదతి....
ఉదయ కిరణాల హిమ  శైత్య భావనాదాల సుకృతి... 
కావ్య వినుతి కవితా సుమతి చలసాని వసుమతి...
అమ్మ!
యతి ఆమె మనసు-  శ్రుతి ఆమె పలుకు-
ఏ కుంతలనో, సకుంతలనో తలపులు తెరచి
గీతలు తుడిచి, కుడికాలు బయటపెట్టి
లోకాలు దాటి రమ్మన్న యశోవతి...
సీత తాను-  భ్రమర గీత తాను-
మనో సరోవరంలో అరవిరిసిన చిత్రలేఖ తాను-
తాను  నడిచింది   "వసుమతీ పథం"
-చలసాని వసుమతి

Write a review

Note: HTML is not translated!
Bad           Good