వసు చరిత్ర

నైమిశారణ్యం ప్రకృతి సౌందర్యంతో విలసిల్లుతూ వుంటుంది. అటువంటి వనంలో ఒకరోజు, శుక శౌనకాది ముని శ్రేష్ఠులు గుమిగూడారు. శుకశౌనకాది మునులు తపస్సంపదతో విరాజిల్లుతూ వుంటారు. వారు పూర్వ చరిత్రను వినాలని కుతూహల పడ్డారు. వారి సమక్షంలో వున్న సూతుని చూచి ఆయనతో ఇలా అన్నారు, 'ఈ మహీతలాన్ని పరిపాలించి పేరు ప్రఖ్యాతులు గడించిన మహారాజు వృత్తాంతాన్ని మాకు వినిపించు.'

సూతుడు చాలా ఆనందపడ్డాడు. మహారాజు వృత్తాంతాన్ని తన నోటిమీదిగా మునులకు విన్నవించడం గర్వకారణంగా కనిపించింది. ఆనందంతో, అతిశయంతో ఉప్పొంగిపోయాడు. ''అయ్యా! వసువు అనే మహారాజు యీ భూమిని పాలించాడు. అతను దేవేంద్రుని నుండి వరంగా యెన్నో గౌరవ చిహ్నాలను పొందాడు. మిలమిల మెరిసిపోతున్న విమానంలో ఎక్కి తిరుగుతూ ఉండేవాడు. అతని దేశానికి ఛేదిదేశం అని పేరు. ఛేది దేశాధిపతి అయిన ఆ వసుమహారాజు కథను మీకు విన్నవించగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు యీ అవకాశాన్ని కల్పించినందుకు మీకు ఎన్నో ధన్యవాదాలు.''

సూతుడు వసుచరిత్రను శుకశౌనకాది మునులకు విన్నవించాడు.....

Write a review

Note: HTML is not translated!
Bad           Good