మధ్యతరగతి వారు తమ ఇళ్ళతో పాటు అదనపు ఆదాయాన్ని పొందేవిధంగా ఇంటిని ప్లాన్‌ చేసుకోవడానికి అనువుగా ప్రత్యేకంగా వాస్తు సహితంగా రూపొందించబడిన పుస్తకం ఇది. వాస్తును అనుసరిస్తూనే దుకాణం, దుకాణ సముదాయం వీధిభాగంవైపు నిర్మిస్తూనే, అదేవిధంగా వాస్తును విస్మరించకుండానే వెనుకభాగంలో మధ్యతరగతివారు ఇల్లు నిర్మించుకోవటానికి వీలైన స్పెషల్‌ ప్లాన్స్‌.

ఇటువంటి గృహ సహిత దుకాణ నిర్మాణాలకు ఇంజనీరింగ్‌ సహకరిస్తే వాస్తులోపం ఏర్పడవచ్చును. సున్నితమూ, కీలకమూ అయిన ఈ అంశాన్ని ప్రత్యేక శ్రద్ధతో పరిశీలిస్తూ, రెండిటినీ సమన్వయం చేస్తూ వీటితోపాటు మధ్యతరగతి వారు భరించ గలిగే బడ్జెట్లో ఇంటి నిర్మాణ ప్లాన్‌ రూపొందించడం అంటే నిపుణులకు కూడా కత్తిమీద సామువంటిదే! దాన్ని సుసాధ్యం చేసిన అనుభవజ్ఞులు ఈ పుస్తక రచయిత. మధ్యతరగతి వారికి ఈగ్రంథం ఒక వరప్రసాదం వంటింది.

ఈ ప్రధానాంశాలతో పాటు గృహ నిర్మాణ సామాగ్రి నిల్వచేసే విధానం, నిర్మాణ సమయంలో కలిగే సందేహాలకు సమాధానాలు, మార్కింగ్‌, ఎలివేషన్‌ జాగ్రత్తలు, వాస్తురీత్యా దుకాణాలకు, గృహాలకు ఏ దిశలో ఏవి వుండాలోల తెలియచెప్పే విధంగా సవివర ప్లాన్‌ చిత్రణ అదనం. ఇంత విలువైన పుస్తకం మీరు పొందకపోతే అమూల్యమైన సదవకాశాన్ని మిస్‌ అయినట్లే!

Write a review

Note: HTML is not translated!
Bad           Good