ఇదొక 'ఎకానమికల్‌ స్ట్రక్చర్‌' అని మొట్టమొదటగా మీకు మీరే తెలుసుకోగల అంశాలున్నాయి. ఎందుకంటే...
ఒక ఇంజనీరు, ఒక వాస్తు శాస్త్రవేత్త, అనుభవజ్ఞుడైన ఒక తాపీమేస్త్రీ నైపుణ్యంగల అతడి సహాయకులు తీర్చి దిద్దితేనే ఇల్లు అనేది ఒక రూపం సంతరించుకుంటూన్న తరుణం ఇది... అనూహ్యంగా పెరిగిన నిర్మాణవ్యయం వల్ల రెండేసి - మూడేసి ఫ్లోర్లు నిర్మించాలంటే, ఉన్నవారు సైతం చుక్కలు లెక్కెట్లే స్ధితి నుండి ఎలా గట్టెక్కవచ్చో ప్రతి అంశం వివరణాత్మకంగా చర్చించిన సమాచారం ఉంది ఇందులో.
కొన్ని సాంకేతిక ముఖ్యాంశాలు...
డ్యూప్లెక్స్‌ భవనం అంటే ఏమిటి? ఎందుకు? ఎవరికి ఉపయోగం? సవివరంగా -ప్లాటు కొనేముందు గ్రహించాల్సిన వాస్తు, సాంకేతిక (ఇంజనీరింగ్‌), రిజిస్ట్రేషన్‌ వంటి అంశాలు.
కదలని చెదరని పునాది కోసం..ఏం చెయ్యాలి?
'మేడమీద మేడకట్టి చూడు' కాదు ....మేడలోన మేడకట్టి' అనేది డ్యూప్లెక్స్‌ ధియరీ అది ఎలా?
శ్లాబు వేసే వేళ...ఎన్నివిధాల ప్రైవసీ (ఏకాంతం) ఏర్పరచుకోవచ్చో - ఆ అంశాలు.
ఉక్కులాంటి గట్టిదనం - అంతకు మించి అత్యధిక భద్రత.
తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ సౌకర్యాలు అమర్చుకునే విధానాలు (మెట్ల క్రింద జాగా కూడా వాడుకునే విధానంతో సహా) దీనిలో ఇవ్వబడ్డాయి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good