(అడవిమల్లె-ఉరిత్రాడు-వెన్నెలమండుతోంది- మరోదయ్యం కధ-కోతి కొబ్బరికాయ- నవలలు)

అన్నీ ఉన్న ఈ దేశంలో ఏమీ లేని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు.

ఎందుకు వున్నారు?

ఈ ప్రశ్నకు చరిత్ర సమాధానం చెప్తే, ఇంకా అలా వుండటానికి ఎందుకు ఒప్పుకుంటున్నారనే ప్రశ్నకు -జనాభా లెక్కల్లోకి కూడా రానివాళ్ళను కలుపుకొని-అరవైకోట్ల మంది సమాధానం చెప్పాలి.

పేవ్‌మెంట్‌ మీద దిక్కులేని చావు చచ్చిన ముసలివగ్గు వెలుగారిన చూపుల్లో కన్నతల్లినీ, నిండీనిండని వయసులోనే పతితలైన అనాధల కమిలిని చెక్కిళ్ళనీడల్లో తన చెల్లెల్నీ చూడగలిగిన అభాగ్యుడూ, నిరుద్యోగీ అయిన చంకద్రం ఆ ప్రశ్నకు సమాధాన్వేషణలోనే ఆహుతి అయిపోయాడని చెప్పడమే కాక, ఆసక్తివాదాన్నీ, పలాయన వాదాన్నీ ఉగ్గుపాలతోనే రంగరించి పోసే ఈ 'నైతిక' సమాజంలో మనిషి నిలబడి, ఎదురు తిరిగితే ఏమౌతుందనే మరో ప్రశ్నను మీ ముందు వుంచడం జరిగింది. 'వెన్నెల మండుతోంది' నవలలో, కలల్లో కూడా కౌంటర్‌ రివల్యూషన్‌నే చూసే ఈనాటి సామాజిక జీవి, ఎందుకు ఏ పరిస్ధితుల్లో, విప్లవోన్ముఖుడు అవుతున్నాడో, వెన్నెల ఎప్పుడు మండుతుందో చెప్పడానికి రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి ఈ నవలలో ప్రయత్నించారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good