ఒరేయ్‌ రవీ, వినరా మరి! ఈ నేల నా పలక, నాగలే నా బలపం, పొలమే నా బడి, భూమ్మీద దిద్దాను. రోజుకు ఒక్కొక్కమాట ఈ భూమే నాకు నేర్పింది. నాతల్లి, దైవం, గురువూ, ఈ భూమేరా రవీ! ఇప్పుడు చెప్పరా మనవడా! నీ బడి గొప్పదో, నా బడి గొప్పదో! నీ చదువెక్కువో, నా చదువెక్కువో..'' అంటాడు సాంబయ్య. అతడు డబ్బయేళ్ళ వృద్ధుడు. తరతరాల వ్యవసాయ జీవనానికి ప్రతినిధి.
వాసిరెడ్డి సీతాదేవి గారు రాసిన 'మట్టిమనిషి' నవల మూడు తరాల కథ. మూడు తరాల్లోనూ వరుసగా సాంబయ్య, వరూధిని, రవి అనే పాత్రలపైన కథ నడుస్తుంది. కండలు కరిగించి, ఎముకలు విరిచి, చెమటలూర్చి మట్టికొక వైభవాని&్న సంతరించినవాడు సాంబయ్య. విశృంఖల ప్రవర్తనతో, వికారపు ప్రలోభాలతో ఆ వైభవాన్ని కాలరాచి, జీవితంలో భంగపడిన హతభాగ్యురాలు వరూధిని. తనని తాను వెంకటపతి కుమారుడిగా గానీ, వరూధిని కొడుకుగా గానీ చెప్పుకోలేని స్ధితిలో సగర్వంగా మనవడినని చెప్పుకోగలిగిన పదేళ్ళ పసివాడు రవి.
'కొత్తా, పాతా యావత్తు ఒక మూస నుండి కరిగి సమ్మిళితమై ఒక నూతన శక్తిగా విజృంభించి జగన్నాధుని రథం వలె పరిభ్రమిస్తున్నది. ఇది నిజంగా జగన్నాధుని రథమే. ఈ మహాశక్తిని ఎదిరించడానికి ఎవరికీ సాధ్యమౌతుంది?' అని 1922లో ఉన్నవవారు చెప్పిన మాటనే 1972లో సీతాదేవిగారు సూచనప్రాయంగా గట్టి పునాదిని నిర్దేశిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ వారి ఉత్తమ నవల పురస్కారమందుకున్న మట్టిమనిషికి ఇది నాలుగవ ముద్రణ.

Write a review

Note: HTML is not translated!
Bad           Good