వార్తా రచన పత్రికలు రేడియో కోసం మాత్రమే కాకుండా టీవీ న్యూస్‌ చానళ్ళ కోసం, ఇతర చానళ్ళ న్యూస్‌ బులెటిన్లకోసం కూడా అసవరం అవుతున్నది. పత్రికలకోసం వార్తలు రాసే విధానానికీ, రేడియో, టీవీ కోసం వార్తరచన చేసే విధానానికి వ్యత్యాసం ఉంది. మెళకువలనూ చర్చించడానికి ఉద్దేశించింది. ప్రాథమికంగా వార్త స్వభావం, రచన ఉద్దేశం ఏ మాధ్యమానికైనా ఒకటే. సమర్పణ శైలిలోనే తేడా. ఈ తాజా ముద్రణలో టీవీ చానళ్ళకు వార్తలు అందించడంలో అనుసరించవలసిన శైలి గురించి కూడా వీలైన సూచనలు చేశాను. టీవీ, రేడియో మాధ్యమాల పత్రికరంగంపై మరింత వివరంగా రాయవలసిన అవసరం ఉన్నది. ప్రావీణ్యం పుష్కలంగా ఉన్న విలేకరులే వేగం పాటిస్తూనే తప్పులు లేకుండా పరిశుభ్రంగా వార్తలు రాయగలరు. మెళకువలు క్షుణ్ణంగా తెలిసిన ఉపసంపాదకులే తక్కువ సమయంలో ఎక్కువ సమర్థంగా వార్తా రచనలోని లోపాలను పరిహరించి వార్తను బాణంగా మలచగలుగుతారు.

ఇందుకోసమైనా వార్తారచనకు సంబంధించిన పుస్తకాలు నేటితరం పాత్రికేయులు విధిగా చదవాలి. మొదటి ముద్రణలో ఇచ్చిన ఉదాహరణలలో కొన్నిటికి కాలం చెల్లింది. వాటిని తొలగించి తాజా ముద్రణలో కొన్ని సమకాలీన ఉదాహరణలను చేర్చాను.

- కొండుభట్ల రామచంద్రమూర్తి

Pages : 191

Write a review

Note: HTML is not translated!
Bad           Good