వర్ణనా నిపుణుడు కవి

మన మహాకవులు ఈ నిర్వచనానికి నిదర్శనలు. వారెంతటి వర్ణనా నిపుణులో తెలుసుకోవాలంటే వారి కావ్యాలన్నీ చదవాలి. అటువంటి శ్రమను తగ్గించి ఒకే చోట వారి వర్ణనలన్నింటినీ మనముందుంచే గ్రంథం 'వర్ణన రత్నాకరం'.

రత్నాకరమంటే సాగరం. ఈ గ్రంథం ఒక రత్నాకరం. ఈ రత్నాకరంలోని రత్నాలు వర్ణనలు.

ఒకే వస్తువును కవులు ఎన్ని విధాల వర్ణించారో, వారి దృష్టి ఆ వస్తువుపై ఎన్ని కోణాల్లో ప్రసరించిందో తెలుసుకొంటే మన హృదయం ఆనందంతో విప్పారుతుంది.

మన మహాకవుల ప్రౌఢ వర్ణనలు అంత సులువుగా అర్థంకావు. వాటిని అర్థం చేసుకొని ఆస్వాదించడానికి సరళమైన వ్యాఖ్యానం అవసరం.

సహృదయ పాఠక మిత్రులకు మిత్రునివంటి ఈ పాఠక మిత్ర వ్యాఖ్యతో వర్ణన రత్నాకరాన్ని ఆస్వాదించండి.


'ఆదరినుండి యీదరికి నాంధ్రమయంబు ప్రబంధ సాగరం

బీది మునింగి లోతరసి యెక్కడ నున్నవో యెత్తి తెచ్చి య

ష్టాదశ వర్ణనామణుల జక్కగ హారములన్‌ రచించి యా

మోదమునన్‌ సరస్వతికిబూన్చి కృతార్థతగంటి లక్ష్మణా'

- వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి

Pages : 392

Write a review

Note: HTML is not translated!
Bad           Good