'మనది భారత దేశమమ్మా
మనది  భారతజాతి తల్లీ'' అని గొంతెత్తి పాడుతుంటారు. భరతుడు పాలించిన దేశం గాబట్టి, దీన్ని భారతదేశ మన్నారు. అయితే ఈ భరతుడెవరు? వీని కులగోత్రాలేమిటి?
భరతుని తల్లి - శకుంతల, తండ్రి - దుష్యంతుడు.
మరి శకుంతల ఎవరు?
క్షత్రియుడైన విశ్వామిత్రునికీ, దేవవేశ్యయైన మేనకకీ పుట్టిన పిల్లయే - శకుంతల. దీన్ని బట్టి శకుంతలది - ఏ కులం? వేశ్యాపుత్రికయైన శకుంతల, క్షత్రియుడైన దుష్యంతుడూ గాంధర్వ వివాహం చేసుకొన్న ఫలితంగా పుట్టిన వాడే - భరతుడు. అలాంటప్పుడు, వేశ్యాపుత్రికయైన శకుంతలకీ, క్షత్రియుడైన దుష్యంతునికీ పుట్టిన భరతునిది ఏ కులం? భారతీయులమైన మనది ఏ కులం?
సాధారణంగా ''మీది ఏ కులం?'' అని మనల్ని అడుగుతుంటారు. బ్రాహ్మడుగా చలామణీయైన వసిష్టునికీ, మాదిగ యువతియైన అరుంధతికీ పుట్టిన ''శక్తి'' అనేవాడిది ఏ కులం?
శక్తికీ, పంచమ యువతియైన అదృశ్యంతికీ పుట్టిన పరాశరునిది ఏ కులం?
పరాశరునికీ, బెస్తకన్యయైన మత్స్యగంధికీ పుట్టిన వేదవ్యాసునిది ఏ కులం?
యమధర్మరాజుకీ, కుంతికీ పుట్టిన ధర్మరాజుది ఏ కులం?
గాలిదేవుడికీ కుంతికీ పుట్టిన భీముడిది ఏ కులం?
ఇంద్రుడికీ కుంతికీ పుట్టిన అర్జునుడిది ఏ కులం?
అశ్వనీ దేవతలకీ మాద్రికీ పుట్టిన నకుల-సహదేవులది ఏ కులం?
పాయసానికీ కౌసల్యకీ పుట్టిన శ్రీరాముడిది ఏ కులం?
చిప్పల్లోంచి దొప్పల్లోంచి కుండల్లోంచి రండల్లోంచి పుట్టిన మన యావత్‌ పురాణ పురుషుల కులాలేవి? వారి కులాలేవో మనకి తెలియనప్పుడు, మన కులం గొప్పతనం గూర్చి విర్రవీగడం వెర్రితనం గాదా?....

Write a review

Note: HTML is not translated!
Bad           Good