మనం రోజూ తీసుకునే ఆహారంలో ఏవేని ఎలా ఉపయోగ పడుతున్నవి వివరించిన పుస్తకమిది. ఓ రకంగా ఇది వంటల పుస్తకమే కాదు వైద్య గ్రంథం కూడా.
లోగడ మూడు భాగాలుగా ప్రకటించబడిన ''వంటలు - పిండివంటలు'' పుస్తకం పాఠకుల సౌకర్యం కోసం దరిమిలా రెండు భాగాలుగా ప్రకటించబడింది. ఇలా విడివిడి భాగాలకంటే అన్నీ కలిపి ఒకే సమగ్ర సంపుటంగా ఉంటే బాగుంటుందని చాలామంది పాఠకులు సూచించిన మీదట అన్నీ కలిపిన 'కంబైన్డ్‌ ఎడిషన్‌' ప్రచురిస్తున్నాము.
ఇంతవరకూ ఈ పుస్తకంలోని కొలతలు కొలమానాఉ పాత పద్ధతిలోనివి ఉండేవి. ఇప్పుడే తరం పాఠకులకు ఆ కొలతలు తెలియనందున, ఇప్పటి పాఠకుల కోసం అన్నీ కొత్త కొలతలు కొలమానాలివ్వడం జరిగింది. కొలతల్లో చేర్పులు మార్పులు తప్ప ఐటమ్స్‌ అన్నీ మామూలుగానే ఉన్నవి.
ఇప్పుడు ఈ పుస్తకంలో మరో విశేషం. వంటల్లో వాడే ప్రతి కూర, వస్తువు గురించి, అది మనకెలా ఉపయోగపడుతున్నదీ వివరించారు. శరీర నిర్మాణానికి, అభివృద్ధికి, మనో వికాసానికి, తేజస్సుకు - మన శరీర ఉష్ణోగ్రతను సమంగా వుంచడానికి మనం రోజూ తీసుకునే ఆహారంలో ఏవేవి ఎలా ఉపయోగపడుతున్నవీ వివరించారు. ఓ రకంగా యిది 'వంటల పుస్తక'మే కాదు - 'వైద్య గ్రంథం' కూడా! ఇలాంటి పుస్తకం యింతవరకూ తెలుగులో రాలేదు. ప్రతిఒక్కరూ ఒక్కసారి చదివి తెలుసుకోవలసిన విషయాలెన్నో యిందున్నవి. ప్రతి ఇంటా తప్పక ఉండదగిన పుస్తకం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good