మనం ప్రస్తుతం ఏమాత్రం వెరపు లేని పెట్టుబడి తర్కం, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి నీడన నివశిస్తున్నాము. పెట్టుబడి తర్కం అంతకు ముందు కనీ వినీ ఎరుగని రీతిలో ఒక వంక అష్టైశ్యర్యాలు మరో వంక నిష్ట దరిద్రం పెంపొందిస్తోంది. ఈ పరిణామాన్ని మార్క్స్‌ ఎప్పుడో చూడగలిగాడు. కొద్దిమంది ధనవంతులు ఎక్కువ మంది పేదలు ఉండటం విషయం కాదు. ఎక్కువమంది పేదలుగా ఉన్నందునే కొద్దిమంది ధనవంతులుగా ఉండగలుగుతున్నారన్నదే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఇది ''మనం గెలవటమే కాదు. మనం తప్ప మిగిలిన వాళ్లంతా ఓడిపోవాలి'' అన్న ఛెంఘీజ్‌ఖాన్‌ తర్కం.పరాయీకరణను అధిగమించి విముక్తి సాధించాల్సిన అవసరం గతం కంటే నేడు మరింతగా కనిపిస్తోంది. అక్టోబరు  విప్లవం వర్తమాన ప్రపంచంలో దాని ప్రాసంగికత గురించి ప్రభాత్‌ పట్నాయక్‌ ఇచ్చిన ఈ నాలుగు ఉపన్యాసాలు అటువంటి భవిష్య ప్రపంచం గురించి చర్చిస్తాయి. - నిరుపమసేన్‌

పేజీలు : 88

Write a review

Note: HTML is not translated!
Bad           Good