వాల్మీకి రామాయణంలో రాముడు మానవుడే

మళ్ళీ మనముందుకో రామాయణం. 'వందే వాల్మీకికోకిలమ్‌'. అయినా దీని ప్రత్యేకత దీనిది.

    భౌతికశాస్త్రం లోతెరిగిన శాస్త్రవేత్త, ఆచార్యుడు, నైతిక విలువలు నిలబెట్టడం కోసం రచించినది. ఇది వత్తులు చేసుకుంటో కాలక్షేపం చేసేవారికోసం కాదు. ఒత్తిడితో బాధపడుతున్న యువతరం కోసం. పెత్తనంతో ప్రపంచాన్ని జయించాలనుకునేవారి కోసం కాదు. ప్రేమతో ప్రపంచాన్ని అక్కున జేర్చుకోవాలనుకునేవారికోసం. దబాయించి వాదించేవారికోసం కాదు. గుబాళించేలా మాట్లాడాలనుకునేవారికోసం.

    వాల్మీకి మహర్షి వేదధ్వని తరంగాలను రామకథమీద మాడ్యులేట్‌ చేసి మానవ జాతికందిస్తే, ఉప్పులూరి కామేశ్వరరావుగారు రామాయణాన్ని శాస్త్రీయ విజ్ఞాన వేదికమీద మాడ్యులేట్‌ చేసి మనకందిస్తున్నారు. - మహాసహస్రావధాని డా. గరికిపాటి నరసింహారావు.

రామాయణాన్ని కావ్యదృష్టితోనే కాకుండా విజ్ఞాన దృష్టితో కూడా అనుశీలన చేసిన నూతనప్రయోగం యీ పుస్తకం. రామాయణంలో మనకి తెలియని శాస్త్రీయ, సాంకేతిక విషయాలెన్నో నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని వెలికితీసి ఆధునిక విజ్ఞానంతో సమన్వయం చెయ్యడంలో రచయిత కృతకృత్యులయ్యారు. రచన సంభాషణ పూర్వకంగా ఉండడంతో మరో ప్రయోజనం కూడా సిద్ధించింది. పాఠకులకి కలిగే సందేహాలు చదువుతూండగానే తీరిపోతాయి. - జానకీజాని (సామవేదం జానకిరామశర్మ)

Write a review

Note: HTML is not translated!
Bad           Good