మనిషి ఎక్కడి నుండి వచ్చాడు? ఈ ప్రశ్నకు రెండు రకాల సమాధానాలు వస్తాయి. దేవుడు సృష్టించాడనేది ఒక సమాధానం. మనిషి కోతి నుండి పుట్టాడనేది రెండో సమాధానం. మొదటిది పురాణాలు చెప్పే సమాధానం. రెండోది సైన్సు చెప్పే సమాధానం. ఆధారాలతో సహా నిరూపించేది సైన్సు. కేవలం నమ్మకం మీద ఆధారపడేది పురాణం.