ఈ పుస్తకము నందు శ్రీ వరదచార్యులుగారి జీవితం మరియు సాహిత్య ప్రస్తావన గురించి వివరించబడింది. వానామామలైవరదాచార్యుల వారికి గత శతాబ్ది తెలుగు సాహిత్య చరిత్రలో విశిష్ట స్థానం తప్పకుండా ఉంటుంది. "అభినవ పోతన"గాప్రసిద్దులైనవరదాచార్య తన జీవితంలో మూడవ వంతును కేటాయించి రచించిన "పోతన చరిత్రము" తెలుగు కవిత్వ చరిత్రలో ఒక మహత్తర నిర్మాణంగా నిలిచిపోయింది. ఒక్క మహా కావ్య రచనకే ఆచార్యులవారిని పరిమితం చేయవలిసిన పనిలేదు. సారస్వత వనంలో ఎన్నెన్నో కమ్మని పవనాలు వ్యాపించేలా చేసిన ప్రతిభావంతుడు, నిత్య కవితా పరిశ్రమి-వరదాచార్య. ఆయన బాల్యమిత్రులొకరు వ్యాసం వ్రాస్తూ "వరదాచార్య వ్యర్థంగా గడిపిన సందర్బాన్ని తానింతవరకు చూడలేదు" అని గుర్తు చేసుకున్నారు. తనదైన అక్షర జగత్తులోఆరేడు దశాబ్దాలు విహరించిన భావుకుడు-వానమామలైవరదాచార్యులు.  
ఈయన రచనల్లో ఎన్నో అమానవీయ దృశ్యాల్ని ఆచార్యులు వారు చిత్రించారు. ఉదాహరణకు వాటిలో ఒకటి..... "నిజాం రాష్ట్ర బీద వెట్టి వాడా, నీ పొట్టకు అధికారుల తిట్లు తిండిగా మారాయి. ముల్లెలు మూటలు పెట్టెలు మోస్తావు. దప్పిక ఆకలిని భరిస్తూ ఉంటావు. ఎండలో చెమటలతో వర్షంతో తడిసిన వస్త్రాలతో చలికి వణికిపోతూ నడుస్తూనే ఉంటావు. నిన్ను చూస్తే ఘోరమైనాన తపస్సు చేసేవాడిలా ఉంటావు. లోకసేవనే ఉన్నావు. నువ్వు వీరుడివి. వేప బెత్తాలతో వీపు వాచిపోతుంది. ఎముకల గూడుగా నువ్వు మారుతున్నావు. నీపై ఎవరికీ దయ లేదు ఎక్కడా నీ దేహంలో కండ అనేది కానరాదు" అని బీద వెట్టి వాడి గురించి దయనీయ వర్ణన ఉంది. ఇంతటి దీన స్థితిలో ఉన్న బీద వెట్టి వాడితో ఊడిగము చేయించుకునే పెద్ద మనుషులనువరదచార్యులు వారు "మానవాసురులు" అనవచ్చునని విమర్శించారు......... ఇలా ఎన్నో దృశ్యాలు ఆయన సాహిత్యంలో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి.     -డాక్టర్ గుమ్మన్నగారిబాలశ్రీనివాసమూర్తి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good