కథల గురించి...

ఈ కథల సంకలనం తేవడానికి ముగ్గురు ముఖ్య కారకులున్నారు. వారు శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, శ్రీ వాసిరెడ్డి నవీన్‌, పొన్నపల్లి సీత. వారికి కృతజ్ఞతలు.

నిజానికి నాకంత తొందరగా ఏవీ నచ్చవు. నేను రాశానని బయటపెట్టిన మొదటి కథకు ముందు పదహారు కథలు రాసి చించేసిన చాదస్తం నాది. కానీ ఈ కథలన్నీ ఆరుద్రగారన్నట్లుగా స్వయంభూతికలు. ఎన్నో ఏళ్ళ నుంచి తమను స్వయంగా పరిచయం చేసుకొని నా హృదయం మీద ముద్రలు వేసినవి. వీటికి ఎవరి సిఫారసులు, యోగ్యతా పత్రాలు లేవు. ఇలా పేరును బట్టిగాక తీరునుబట్టి కథను కథగా గుర్తు పెట్టుకొని ఎంపిక చేసిన కథలు అరుదని నా అభిప్రాయం. నాకు నచ్చి  నేను పదిలపర్చుకొన్న ఈ వైవిధ్యభరితమైన కథలు సహృదయ పాఠకలోకానికి నచ్చుతాయని ఆశిస్తున్నాను. - వంశీ

Write a review

Note: HTML is not translated!
Bad           Good