బాలకాండము

''కన్నతాతా! ఏదైనా కథ చెప్పవా?'' మా కుటుంబ సభ్యులందరం మాట్లాడుకుంటూ ఉండగా మద్యలో అడిగాడు మా మనవడు సిద్దూ.

''ఏకథ చెప్పమంటావు కన్నా!'' అడిగాడు వాణ్ణి.

''కథలెందుకు మామయ్యగారు! మా తరం వాళ్లకి కూడా రామాయణ, భారతాలు తెలియకుండా పోతున్నై. ఇక సిద్దూలాంటి వాళ్ళకి చెప్పేవాళ్ళే ఉండకపోవచ్చు. కాబట్టి ముందు రామాయణాన్నే చెప్పండి'' అన్నాడు మా అల్లుడు రాజశేఖర్‌.

''రాజశేఖర్‌! రామాయణ, భారతాలు గూడ అద్భుతగాథలేనయ్యా! వాల్మీకి, వ్యాసుడు అనే మహాకవులు సృష్టించిన గొప్ప కావ్యాలు. అవి మన భారత జాతి సగర్వంగా కాపాడుకొనవలసిన వారసత్వ సంపద. అందువలన భారతీయులందరూ తరతరాలుగా ఆ సంపదను కాపాడుకోవాలి. ఒక తరం నుండి మరొక తరానికి అందించాలి. అందువలన వాటిని మీకు వివరిస్తాను. ముందుగా రామాయణాన్ని చెబుతాను'' అంటూ రామాయణ గాథను చెప్పడం మొదలెట్టాను.

''పూర్వకాలంలో, అంటే త్రేతాయుగంలో ''ఇక్ష్వాకుడు'' అనే పేరుగల మహారాజొకడు ఉండేవాడు. ఆయన...

''మామయ్యగారూ! త్రేతాయుగమంటే ఎప్పుడండీ'' మధ్యలోనే నన్ను ఆపి అడిగింది మా కోడలు సౌజన్య.

''చెబుతానమ్మా! మన పురాణాల ప్రకారం మనం ప్రస్తుతం కలియుగంలో జీవిస్తున్నాం. దీని కాల పరిమితి 4,32,000 సంవత్సరాలు. అందులో ఇప్పటికి 5,100 సంవత్సరాలు గడిచిపోయాయి. దీనికంటే ముందు ద్వాపరయుగం గడిచిపోయింది. దాని కాల పరిమితి 8,64,000 సంవత్సరాలు. దాని కంటే ...

పేజీలు : 124

Write a review

Note: HTML is not translated!
Bad           Good