Rs.150.00
In Stock
-
+
రాజ్యాంగపరంగా మన సమాజంలో ఎరుకలివాళ్ళు షెడ్యూల్డ్ తెగగా గుర్తించబడినప్పటికీ వారిని ఎదగాల్సినంత మేర ఎదగనీయడంలేదు. నాగరీకులం అనుకునే మన సమాజం, రాజకీయాలు, ప్రభుత్వాలు వాళ్ళను ఎలా అణగదొక్కుతున్నారు? వాళ్ళకుండే హక్కులను ఎలా నేల రాస్తున్నారు? అన్న విషయాలను ఈ నవల చక్కగా ప్రతిబింభించింది.
ఇన్ని ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని, ప్రాణాలకు కూడా తెగించి ఒక ఎరుకల కుటుంబం చదువుకోవడానికి పడ్డ ఆరాటం, చదువు సహాయంతో అందుకునే ఫలాలను అందుకోనీయకుండా గిరిజనేతరులు చేసిన కుత్సితాలు, కుతంత్రాలను వెంకటయ్య కుటుంబం ఎంతో క్షోభపడి ఎదుర్కొన్న తీరు అభినందనీయం.
పేజీలు : 208