ఇది ఒక్క కట్టా నరసింహారెడ్డిగారి విషయమేకాదు, అనేక మది విజ్ఞాన శాస్త్ర పరిశోధకుల, అధ్యాపకుల జీవితానుభవం. పుట్టిపెరిగిన ఊరు, కన్నతల్లి ఆప్యాయత, తండ్రిగారిచ్చిన క్రమశిక్షణ సంస్కారం, నగర జీవిత మిశ్రమ స్పందన, ఉస్మానియా విశ్వవిద్యాలయం కల్పించిన బహుముఖీనమైన అవకాశాలు, అకడమిక్‌ రంగంలో సాధించిన విజయాలు, నల్లగొండ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ వంటి అత్యున్నతమైన పదవులను అధిరోహించడం వలన కలిగిన అనుభవ నిక్షేపానికి అక్షరరూపమే ఈ వజ్రపుష్పాలు.

నరసింహారెడ్డిగారు నడిచివచ్చిన పాదముద్రలన్నీ ఈ కవితల్లో ఉన్నాయి. ఎక్కిన ప్రతిమెట్టుపై పొందిన విజాయానుభూతి, దారిలో ఎదురైన ముళ్లూ, గులాబీలు, ఒడిదుడుకులు, ఎగుడు దిగుళ్ళు పదాలుగా, వాక్యాలుగా, కవితా పంక్తులుగా రూపాంతరం చెందాయి.

కవి చుట్టూ ఒక కుటుంబం ఉంటుంది. సమాజం ఉంటుంది. మంచీ చెడూ రెండూ ఉంటాయి. చీకటీ వెలుతురూ ఉంటాయి. ఆత్మీయతలుంటాయి, అనుబంధాలుంటాయి, జ్ఞాపకాలుంటాయి. పశ్చాత్తాపాలుంటాయి.

అలాగే ఈ కవితా సంపుటిలో మిత్రులు నరసింహారెడ్డిగారి విభిన్న అనుభూతులు, ఊహలు, ఉద్వేగాలు, కల్పనలు, ఆదర్శాలు, లక్ష్యాలూ నిక్షేపమై ఉన్నాయి.

- డా|| ఎస్వీ సత్యనారాయణ

Write a review

Note: HTML is not translated!
Bad           Good