...''ప్రాచీనంలోనే యుగపరంపరగా విస్పష్టమైన మార్పులు కలుగుతూ వచ్చినపుడు, ఈనాడు ప్రతిదేశంలోని విజ్ఞానమూ, ఏ దేశంలో ఏ వ్యక్తికైనా ఇంత సులభంగా అందుబాటులోనికి వచ్చినప్పుడు, ఆధునిక సారస్వతంలో కలిగిన మార్పు కన్న రాదగినదే ఎక్కువ ఉన్నదేమో అనిపిస్తుంది'' అని ఊహించి సంపాదకులు దీనికి ''వైతాళికులు'' అని పేరు పెట్టినారు. నిజంగా ఇది సంధి సమయమే. అదే అయితే, ఇది భావ సౌభాగ్యానికి ఎంతమంచి ప్రారంభం ఇస్తున్నదో అని ఆశ కలుగక మానదు - ఈ సంపుటం తిలకిస్తే. మరికొందరు వైతాళికులున్ను ఇందు చేరవలసినవారు లేకపోలేదు.
... నవ్య కవితలపట్ల వచ్చే విమర్శలు ఎన్నో దూసుకుసాగినవి. కాని అది సజీవమని చూపడానికి ఈ సంపుటము నిలుస్తున్నది.
... ఇంచుమించు నవ్య కవులందరితోనూ చనువైన నెయ్యము గల ముద్దుకృష్ణ గారు వారివారి కవితలను సాంగోపాంగముగా తరిచి ఒప్పిందమైన సంకలనం చేయడానికి తమకుగల అవకాశాన్ని బాగా వినియుక్తం చేశారు. ఆయా కవులను గురించి వీరు గ్రంథము చివర ఇచ్చిన వివరణలు విమర్శ దృష్టీ, రసికతా నిండినదై చదువరికి చాలావరకు సరియైన బోధన ఈయగలిగి ఈ సంపుటానికి మంచి ప్రయోజనం సంపాదిస్తున్నవి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good