భారతదేశ విజ్ఞానరంగాన్ని, ప రిశోధనా క్షేత్రాన్ని దేదీవ్యమానం చేసిన ప్రతిభామూర్తుల కృషికి అక్షర చిత్రాలివి. వీరి విజయగాధలు భవిష్య పరిధోధకులకు ప్రేరకాల మార్గదర్శకాలు. అంకితభావం, ప్రోత్సాహం, ప్రేరణ, ప్రతిభ, వైయక్తిక సృజనాత్మక శక్తి అసాధ్యాలను సాధ్యం చేసి, ఈ ప్రతిభామూర్తుల్ని కథానాయకులుగా పెంచి పోషించాయో వివరించే శబ్ద చిత్రాలివి.

వైజ్ఞానిక రంగంలో ప్రతిభా మూర్తులు అనే ఈ పుస్తకంలో పదిమంది విజ్ఞానశాస్త్ర బృహస్పతులు గురించి, వారి పరిశోధనల గురించి, వారి కాలంలో సైన్స్‌ రంగాన్ని అవి ఎలా ప్రభావితం చేసి మార్చివేశాయో చిత్రించడం జరిగింది.

జె.సి.బోస్‌: నిస్త్రంతీ విధానానికి ప్రేరణ, మూలాధారం అయిన విద్యుదయస్కాంతతరంగ ప్రయోగకర్త.

శ్రీనివాస రామానుజన్‌ : గణిత శాస్త్రంలో మహామేధావులలో ఒకరు.

సి.వి.రామన్‌ : విజ్ఞానశాస్త్రంలో భారతదేశానికి తొలిసారి నోబెల్‌ బహుమతి సాధించిన శాస్త్రవేత్త.

ఎస్‌.ఎన్‌.బోస్‌ : ఐనస్టీన్‌ కొన్ని సిద్ధాంతాల రూపకల్పనకు ప్రేరకుడు.

మేఘనాథశాహూ : సూర్యుడి వాతావరణంపై ఒక ప్రత్యేక ఫార్ములా ప్రతిపాదించిన ద్రష్ట.

ఎస్‌.చంద్రశేఖర్‌ : నోబెల్‌ బహుమతి విజేత, చీకటి బిలాల స్రష్ట.

హోమీ భాభా : నవస్వతంత్ర భారతదేశానికి అణుశక్తి సాహితీకల్పనకై కలగన్నవాడు.

హరగోవింద్‌ఖొరానా : మానజీనోమ్‌కి ప్రేరకుడు, నోబెల్‌ విజేత.

ఇ.సి.జార్జి సుదర్శన్‌ : అణు భౌతిక విజ్ఞానంలో కీలకపరిశోధకుడు.

జయంత్‌ వర్లీకర్‌ : సామాన్యుడికి సైన్స్‌కి దగ్గర చేసిన మేధావి, ఖగోళ భౌతికవేత్త.

విజ్ఞానరంగంలో ఉజ్జ్వల తారలయిన వారి గురించి పరిచయంకోరే వారందరికీ యిది ఉపద ఎన్నో వైజ్జానిక సూత్రాలు, ఆలోచనలు వివరణ ఇది. బొమ్మలు, సూచికలుగల అక్షర దర్పణం ఇది.

Pages : 107

Write a review

Note: HTML is not translated!
Bad           Good