బాధనుండి విముక్తినిచ్చేందుకు వైద్యులు ప్రయత్నిస్తారు. అయితే తెరమీద దర్శకుడు, నేపథ్య సంగీతకారులూ కనపడనట్లే, ఒక వైద్యుడు చేసే చికిత్స వెనుక ఎంతో చరిత్ర, ఎందరిదో త్యాగమూ వున్నాయి. వుంటాయి.

వైద్యవిజ్ఞానాన్ని ఈనాటి స్థాయికి తెచ్చేందుకు ఎందరో మహనీయులు అహరహమూ శ్రమించారు. స్థూలంగా కొందరి మేధ, కృషి, త్యాగం గురించి తెలుసుకోవాలన్న ఆకాంక్ష తీర్చటానికే ఈ 'వైద్యం - శాస్త్రజ్ఞులు'.

ఫ్రాన్స్‌ కంతటికి తలమానికమైన సర్జన్‌గా రూపొందిన వాడు 'డ్యుపుట్రయిన్‌'. వైద్యవిధ్యార్థిగా దరిద్రంలో ఓలలాడుతూ, చదువుకోటానికి దీపంలో నూనెలేక డిసెక్షన్‌ రూమ్‌లో కళేబరాల నుండి వచ్చిన కొవ్వు వాడుకున్నాడు. క్రింది దవడను తొలగించే శస్త్ర చికిత్స మొదట చేసిందితనే. గర్భకోశపు కేన్సర్‌లో మొట్టమొదటిసారిగా సెర్విక్స్‌ ఆపరేషన్‌ చేసి తొలగించిందతనే. తొలిసారిగా కృత్రిమంగా మలద్వారాన్ని వేరొకచోట ఏర్పాటు చేసిందతనే.

జఠరాశయవు కేన్సరుకి శస్త్రచికిత్స తొలిసారిగా చేసిన వాడు ధియోడొర్‌ బిల్‌రాత్‌. విపరీతంగా సంగీతాన్నభిమానించే బిల్‌రాత్‌ ఏడాది కొకనెల అయినా బ్రాహ్మ్స అనే గొప్ప సంగీతకారుడి వద్ద గడిపేవాడు. వారిరువురూ అంత స్నేహితులు.

జ్వరాలకు వాడే డోవర్స్‌ పౌడర్‌ కనుగొన్న డాక్టర్‌ ఒక ఓడదొంగ అంటే నమ్ముతారా? చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన నవల 'రాబిన్‌సన్‌ క్రూసో' నవలకు నిజజీవితంలో హీరో ఇతడే!

ఎన్నో వివేషాలు! వింతలు!! శాస్త్రజ్ఞుల గాథలు!!

పాపులర్‌ సైన్స్‌ రచయితగా ఎన్నో విలువైన గ్రంథాలను లక్షల మంది పాఠకులకు అందించిన ప్రముఖ రచయిత డాక్టర్‌ పరుచూరి రాజారామ్‌ గారందిస్తున్న మరో విజ్ఞాన సౌరభం 'వైద్యం - శాస్త్రజ్ఞులు'!

Pages : 72

Write a review

Note: HTML is not translated!
Bad           Good