బాహాటకాది వైద్య గ్రంథములు పెక్కులుండగా నీవైద్య కల్పతరువు వలనంబ్రయోజనం బేమియందురు ఆ బాహాటకాదులు విపులంబులు సమమంబులు ఈయది తెనుంగున సులభశైలిగా వచనరూపముగా రచియింపబడి, కారణంబుద్ధ్యా కార్యంకర్తవ్యం అనున్యాయమున జ్వరాదిరోగ కారణంబుల నెఱింగినం జికిత్స జేయుట సులభంబని నాయనుభవసిద్ధంబులైన వైద్యాంశంబులు శాస్త్రావిరుద్ధములుగా వ్రాయంబడియె ఈ గ్రంథము.

 మఱియు నీ గ్రంథము రాజవైద్యులును, నితర వైద్యులును యథోచితారోగ్యకరాంశ జిజ్ఞాసువులునువిలోకింపం దగియున్నయది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good