సుబ్రహ్మణ్య శాస్త్రి గారు జగము ఎరిగినవాడు: జగము తన్నెరిగిన-వాడు. మరిన్ని...విశేషించి..బ్రాహ్మణుడు, అనగా బ్రాహ్మణీకమే ఆయన రచన: గోదావరీ మండలంలో వెలనాటి వైదిక కుటుంబాలు, ఆయన సాహితీ సమరాంగణము, వారి పోకడలూ, మెలకువలూ, ఆయన వాక్యములు.
వారి కష్టసుఖాలు, ఆయన చెప్పిన కథలు,
సుబ్రహ్మణ్యశాస్త్రిగారి కథలు...కొన్నైనా చదివితే..
తెలుగు కుటుంబాల ఆపేక్ష...అంత:కరణలు ఎలాటివో..ఆ మరియాదలు, మన్ననలు ఎట్టివో అర్థమౌతుంది! ఆశ్చర్యవేస్తుంది! ముచ్చటౌతుంది!
'వడ్లగింజలు'...మించే కథ ఉందా!
'యిల్లుపట్టిన వెథవాడపడుచు' ... అలా మరొకరు వ్రాయగలిగేరా?
'అనుభవాలూ-జ్ఞాపకాలూ'...నూరేండ్ల తెలుగుతనపు' కూలంకష - క్రోడీకరణ కాదా!... అది వేయ్యేళ్ళపాటు, పదింబదిగా చదువుకోవలసిన గ్రంథం కాదా? తెలుగు మాగాణముతోబాటు, మీగడ తరకలైన శ్రీ శాస్త్రిగారి రచనలు శాశ్వతముగా వర్థిల్లవా!

Write a review

Note: HTML is not translated!
Bad           Good