అమెరికా సంబంధం అని ఎగిరి గంతేస్తే విడాకుల మంజూరు పత్రాల్ని అందుకుంది - దీపిక. అప్పుడు మేనత్త కొడుకు ప్రభాకరంలోని యోగ్యత అర్హత కనిపించింది - ఆమెకూ, ఆమె తల్లిదండ్రులకు. కథ పేరు - 'పడమర తెల్లారింది'.

'ఏటి కెరటం'లో తెలివిగల వధువు పెళ్ళికి ముందు 'ప్రొబేషన్‌' ఆరు నెలల కాలాన్ని సాధించుకొని అప్పుడు పెళ్ళి చేసుకుంటుంది.

కొడుకులు వదిలించుకున్న తండ్రిని కూలివాడు బాబులు, అతని భార్య సాకుతారు....'కొడుకు' కథలో. మెతుకు లేకున్నా మతమే కావాలనే దౌర్భాగ్యాన్ని రూపుమాపిన స్థితిని 'మలయ మారుతం' కథ చూపుతుంది. ఎత్తుగడ నుంచి ముగింపు వరకు చక్కని కవితాత్మక శైలిలో అద్భుతంగా సాగిన కథ ఇది.

ఇలా కథలన్నిటా ఎన్నో జీవన విపర్యాలు, వ్యత్యాసాలు, మనుషుల మనస్తత్వాలలోని వైరుధ్యాలు చదువరిని అంతుర్మఖీనుణ్ణి చేస్తాయి. - విహారి

Pages : 144

Write a review

Note: HTML is not translated!
Bad           Good