శ్రీశ్రీ రచించిన కవిత 'వ్యత్యాసం'. ఈ కవితలో ఆయన ధనికులు పేదలుగా చీలి ఉన్న వర్గసమాజాన్ని వర్ణించారు. ధనికులను మీరు అన్నారు. పేదలను మేము అన్నారు. కవితను పేదల దృష్టికోణం నుంచి రాశారు శ్రీశ్రీ. పేదలతో తాను మమేకమై కవితరాశారు. అవర్గీకరణ అంటే ఇదే. కవిత మొత్తం రెండు భాగాలు. మొదటి 21 పాదాలలో ధనిక సమాజ లక్షణాలను వర్ణించారు. తర్వాత 24 పాదాలలో పేదల సమాజ లక్షణాలను వర్ణించారు. మొదటి భాగాన్ని 'అదృష్టవంతులు మీరు' అని ప్రారంభించారు. రెండో భాగాన్ని 'అభాగ్యులం మేము' అని ప్రారంభించారు. మొదటి భాగం మధ్యలో 'వడ్డించిన విస్తరి మీ జీవితం' అన్నారు. రెండవభాగం మధ్యలో 'మావంట మేమేవండుకోవాలి'. ఒక్కొక్క మారు విస్తరే దొరకదు' అన్నారు. అలాగే మొదటిభాగంలో 'మీ కన్నుల చూపులు సరళరేఖలో' అని రెండవ భాగంలో 'మా దృష్టిది వర్తులమార్గం' అని అన్నారు. తర్వాత మొదటిభాగం చివర్లో రెండూ వర్గాల మధ్య ఒక రేఖ ఉన్నది అన్నారు. రెండవభాగం చివర్లో 'మాకు గోడలులేవు', అన్నారు. న్యాయస్థానాలు రక్షకభటవర్గాలు రేఖను కాపాడతాయి అని మొదటి భాగం ముగింపులో అన్నారు. చెరసాలలు న్యాయ స్థానాలు ఆ రేఖను కాపాడక తీరదు అన్నారు. రెండో భాగం చివర్లో 'గోడలను పగులగొట్టడమే మా పని' అన్నారు. చివర అందుకు మార్గమేమిటో చెప్పారు.
అలజడి మా జీవితం
ఆందోళన మా ఊపిరి
తిరుగుబాటు మా వేదాంతం
సమాజంలో రెండు వర్గాలున్నాయని, వాటి మధ్య వైరుధ్యాలున్నాయని, వాటి మధ్య సంఘర్షణ జరుగుతున్నదని, ఈ సంఘర్షణలో రాజ్యం ధనికుల పక్షాన్నే నిలబడుతుందని, పేదవర్గం ధనికవర్గంతో తెగించి పోరాటం చేస్తుందని చెప్పడం కవి ఉద్దేశం....
పేజీలు : 224