ఈ రిఫరెన్స్‌ వాస్తు ఫెంగ్‌షూయి పుస్తకం ప్రతి అపార్ట్‌మెంట్‌లో కామన్‌ మెయింటెన్స్‌ అనుగుణంగా ఉండవలయును. అంతేకాక ఫెంగ్‌ షూయి చైనా వాస్తు - భారతీయ వాస్తు శాస్త్రాల మూల సూత్రములు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి.

ఈ గ్రంథములో వివిధ దేశాల వాస్తు చరిత్రను వివరించారు. భారతదేశ వాస్తు మొదలు కొన్ని ప్రపంచ దేశాల వాస్తు చరిత్రను వివరించారు. ప్రత్యేకించి చైనా ఫెంగ్‌ షూయి వాస్తు చరిత్రను విస్తృతంగా పేర్కొన్నారు. ప్రాథమిక విషయాలను కూలంకషంగా తెలిపారు. ప్రత్యేకించి గృహంలో భాగాలను పేర్కొని విస్తృతరీతిగా తరించారు.

ఈ వివరణంతా బొమ్మలు, రేఖాచిత్రాలతో నిరూపించారు. ఇంతవరకు వాస్తు సంబంధ గ్రంథాలన్నింటిని సంప్రదించారు. ఆధార గ్రంథాలను పేర్కొన్నారు. చైనా భారతీయ వాస్తు రీతులను తులనాత్మకంగా పరిశీలించారు.

భారతీయ వాస్తు శిల్పి విజ్ఞాన సర్వస్వం వెలువరించిన శ్రీస్వర్ణ సుబ్రహ్మణ్యకవిగారు నేటి వాస్తు శాస్త్రగ్రంథములలోని వికృత ధోరణులకు విచారించి, సార్వజనీయమైన గ్రంథముల కొరకు ఎంతో కృషి చేశారు. 2010 నుంచి సామాన్య కుటుంబీకుడు సొంత గృహం కట్టుకొనే స్థితిలోలేడు. దాదాపు 80 పట్టణములలో బహుళ అంతస్తుల సముదాయములు నిర్మాణమగుచున్నవి. కావున ఇప్పటికి వచ్చిన వాస్తు గ్రంథములలో బహుళ అంతస్తుల గురించి 5 శాతం కూడాలేదు. కాలమాన పరిస్థితులు మారిన తరువాత వచ్చిన వాస్తు గ్రంథముల ఉపయోగం లేదు. కావున ఈ గ్రంథములో బహుళ అంతస్తుల గృహసముదాయముల వాస్తు ఎక్కువగా ఇవ్వటమైనది.

హిందూ దేశములో వాస్తు కాలములను అనుసంధానం చేసిన కట్టడములలో చిదంబరంలోని నటరాజదేవాలయం, కంబోడియాలోని అంగ్‌కోర్‌వాట్‌ దేవాలయం ప్రసిద్ధములు. పెకింగ్‌లోని టెంపుల్‌ ఆఫ్‌ హెవెన్‌ మరియు ఫర్‌బిడెన్‌ సిటీస్‌ అన్నీ ఆకాశము (స్పేస్‌) నందలి ఒక విశేష నక్షత్రముతో అనుసంధాన పరచి నిర్మించబడినవి అగుట గమనార్హము.

భారత రాజ్యాంగ నిర్మాత, శూన్యవాది అయిన అంబేద్కర్‌, ప్రపంచ దేశములలోని అనేకానేక వాస్తు గ్రంథములు చదివి, వాస్తుకు ప్రాముఖ్యం యిచ్చి, పూనాలోని తన లైబ్రరీ, రాజగృహం నిర్మించుకున్నారు. శూన్యవాదులైనా, ఆస్తికులైనా, నాస్తికులైనా, గృహ నిర్మాణం 'సిమెట్రీ ఇన్‌ ఆల్‌ ఆస్పెక్ట్స్‌ అండ్‌ క్రాస్‌ వెంటిలేషన్‌ ఇన్‌ ఆల్‌ ఆస్పెక్ట్స్‌'తో నిర్మించుకొనుట అత్యవసరము. నమ్మకము ఉన్నా, లేకపోయినా, శాస్త్రములను అనుసరించి గృహము నిర్మించుకొనుట వలన నష్టమేమిటి? వాస్తులేని గృహములలో నిత్యశంకితులుగా ఎందుకుండవలయును? ఆలోచించండి? గృహ నిర్మానం ఒక వ్యక్తికి సంబంధించిన విషయంకాదు. కుటుంబ విషయం. కుటుంబంలోని వారందరూ వాస్తు లేకుండా కట్టుటకు ఇష్టపడరు.

Pages : 364

Write a review

Note: HTML is not translated!
Bad           Good