తెలుగు పాఠకులలో ఉషశ్రీగారి పేరు తెలియనివారు ఉండరు. వారు ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడు భారత, రామాయణ, భాగవతాలను ప్రతి వారం సీరియల్‌గా చెపుతూ, అశేష తెలుగు శ్రోతలను ఉర్రూతలూగించారు. ఈ కావ్యాలని పాఠక లోకానికి అందించాలనే సంకల్పం ఆ సమయంలోనే మాకు కలిగింది.

పురాణాలను పుక్కిట పట్టిన సాహితీ ద్రష్ట ఉషశ్రీ గారు. వారితో కనీసం కొన్ని పుస్తకాలైనా తేట తెలుగులో మరియు సరళవచనంలో చందమామ కథల్లాగ పిల్లలు, పెద్దలు అందరూ చదువుకునే విధంగా వ్రాసి ఇమ్మని కోరాము. వారు మా అభ్యర్ధనను అంగీకరించి, అనుగ్రహించిన ఆ 5 పుస్తకాలు వరుసగా రామాయణం, భారత, భాగవతం, భగవద్గీత మరియు సుందరకాండలు పెద్ద టైపులో ఇప్పుడు మీ ముందుంచుతున్నాం.

పై 5 పుస్తకాలు తెలుగునాట ప్రతి ఇంట ఉండదగినవి. ప్రతి పాఠకుడు వీటిని కథలుగానైనా చదువుకొని, మన పురాణేతిహాసాలను ఆకళింపు చేసుకొని మన సాహితీ సాంప్రదాయాలను భావితరాలవారికి అందిస్తారని ఆశిస్తున్నాం. - పబ్లిషర్స్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good