అతడు దేశాన్ని ప్రేమించాడు
స్వేచ్చా స్వాతంత్ర్యాలను ప్రేమించాడు
విప్లవాన్ని ప్రేమించాడు
ప్రేమను విప్లవీకరించిన విప్లవ ప్రేమికుడై
ఉరికంబాన్నే వధువుగా వరించాడు
అతడు శిలువనే పెళ్ళాడిన స్పార్టకస్

భగత్‌సింగ్ రచనలు, భగత్‌సింగ్ గురించిన రచనలు వెలువరించే కృషిని ప్రజాసాహితి పత్రిక, జనసాహితి సంస్థా గత మూడు దశాబ్దాలుగా కొనసాగిస్తున్న సంగతి పాఠకులకు తెలుసు. అందులో భాగంగానే నా నెత్తురు వృధాకాదు పుస్తకాన్ని వెలువరించాము. దివికుమార్ రచించిన 'గాంధీ - భగత్‌సింగ్' అనే వ్యాసాన్ని దాని మొదటి ముద్రణ (1986 మార్చి)లోనే ప్రచురించాం. 2004లో వచ్చిన 3వ ముద్రణకు భగత్‌సింగ్ రాజకీయ జీవితం గురించి కూడా దివికుమార్‌తోనే రాయించాము. ఇంకా వివిధ సందర్భాలలో 'ప్రజాసాహితి'లోనూ, ఇతర పత్రికలలోనూ వచ్చిన ఆయన రచనలను సేకరించి యిపుడు "ఉరికంబం సాక్షిగా..." పుస్తక రూపంలో వెలువరిస్తున్నాము.
- జనసాహితి

Write a review

Note: HTML is not translated!
Bad           Good