ఉపాయం (పిల్లల కథలు - బొమ్మలతో) పెండెం జగదీశ్వర్‌

దశాబ్దకాలంగా తెలుగులో వెలువడుతున్న వివిధ బాలల పత్రికల్లో రచనలు చేస్తున్న పెండెం జగదీశ్వర్‌ వృత్తిరీత్యా అధ్యాపకుడు, నల్లగొండ జిల్లా రామన్నపేట నివాసం. కేవలం పిల్లల కోసం కథలు, వ్యాసాలే కాకుండా పెద్దల కోసం కూడా రచనలు, కార్టూన్లు ఆవిష్కరించిన వీరికి ప్రత్యేకించి బాలసాహిత్యంపైనే ఆసక్తి. ఇప్పటిదాకా 100కు పైగా కథలు, 50 వ్యాసాలు, 200 దాకా కార్టూన్లు ప్రచురించబడ్డాయి. నీతి, వ్యక్తిత్వ వికాసం, శాస్త్రీయ దృక్పథం కలిగించే కథలు రాయడంతోపాటు సామాజిక సమస్యల మీద కార్టూన్లు గీయడం వీరి ప్రధాన అభిరుచులు, జానపద కథలు, బాలల కథలు, తాను తీసిన గోతిలో, నూట పదహారు నవ్వులు - అనే పుస్తకాలు అచ్చవగా మరో ఏడు పుస్తకాలు ముద్రణలో ఉన్నాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good