ధనస్వామ్య వ్యవస్థ పైశాచికానికి, ఫాసిస్టుతత్వానికి జాక్లండన్ పెట్టిన పేరు ''ఉక్కుపాదం``. ఇది 1907లో వెలుగు చేసింది. భవిష్యత్తులో ఒకనాడు ధనవంతుల దొరతనానికి _ ప్రజాసామాన్యానికి మధ్య అనివార్యంగా జరుగనున్న సంఘర్షణని జాక్ లండన్ ఈ పుస్తకంలో మన కళ్ళకు కట్టాడు. మామూలు జనానికి ఆగుపించని దాన్ని అవలోకించగల నిర్ధిష్ట ప్రతిభ, భవిష్యత్తుని ముందుగా వూహించి చెప్పగలిగిన ప్రత్యేక విషయ పరిజ్ఞానం ఆయనకున్నాయి. ఈనాడు మన కళ్ళముందు దొర్లి పోతున్న సంఘటనల దొంతరని ఆయన ఆనాడే పసిగట్టగలిగాడు. ప్రపంచ చరిత్రలోని ప్రసిద్ధమైన పుస్తకాల్లో ఇదొకటి. |