రాజకీయంగా, ధార్మికంగా, సాంస్కృతికంగా భారతీయ పునరుజ్జీవనంలో అత్యద్భుతమైన కాలం బాజీరావు పీష్వాకాలం. 1740 సంవత్సరంలో అతి చిన్న వయస్సులో బాజీరావు మరణించాడు. పాల్గొన్న ప్రతి యుద్ధంలో విజయం సాధించిన బాజీరావు ఇంకొన్నాళ్ళు బ్రతికి ఉంటే 'హిందూ పద పాదుషాహీ' స్వప్నం సాకారమయ్యేదని పలువురు చరిత్రకారులు విశ్వసిస్తారు. కానీ విధి నిర్దేశాన్ని కాలం అనుసరిస్తుంది. బాజీరావు మస్తానీల అమరప్రేమ గాథకు భారతదేశచరిత్రలో ఎందుకనో తగిన ప్రాచుర్యం లభించలేదు. ఒక పాదుషా నర్తకిని హింసించి చంపిన ప్రేమగాథకున్న విలువ ఈ అమరప్రేమ గాథకు రాకపోవటం భారత చరిత్రలోని వైచిత్రికి నిదర్శనం.

బాజీరావు, మస్తానీల తనయుడు పానిపట్‌ యుద్ధంలో మరాఠాల తరపున పోరాడి ప్రాణాలు విడిచాడు.

చరిత్ర చెప్పిన కథలెన్నో మనకు రచయిత తన రచన ద్వారా తెలియజెప్పారు. చదవండి.

Pages : 248

Write a review

Note: HTML is not translated!
Bad           Good