మన దేశంలో ప్రస్థుతం స్వార్ధపూరిత వాతావరణం బలంగా ఉంది.  ఏదీ ఇతరులకి ఉచితంగా ఇవ్వడానికి ఇష్టపడని వారే అధికం.  అంతా ఇతరుల నించి తీసుకోడానికే చూస్తారు.
చేతిలోది పోకూడదని గుప్పెట మూస్తే ఏదీ పోదు.  అదే సమయంలో మన చేతిలోకి ఏదీ రాదు కూడా.
ఈ పుస్తకంలో కథల్లోని పాత్రలు గుప్పెట తెరచి ఉంచేవారు. ఇతరులకి ఉచితంగా ఇచ్చే ఉదార స్వభావం గలవారు.  అందువల్లే వారు ఎంతో ఉదాత్తులుగా కనిపిస్తారు.
మనుసుని తేలిక పరిచే ఈ వ్యక్తిత్వ వికాస తరహా కథలు సాధారణ పాఠకులని అలరిస్తాయి.  ప్రత్యేకంగా ఆథ్యాత్మిక సాధకులు చదవదగ్గ ఉదాత్త కథలు ఇవి.  దాదాపు నలభై ఏళ్ళనించి, రెండు వేలకి పైగా కథలు రాసిన మల్లాది వెంకట కృష్ణమూర్తి కలం నించి వెలువడ్డ ఈ ఆర్థ్ర పూరిత కథలు అన్ని రకాల పాఠకులకి చక్కటి విందు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good