విశ్వేశ్వరుని లీలా విలాసంలో భాగంగా సృష్టియందలి ద్రవ్యరాశిలో ప్రవేశించి తన స్వస్వరూపాన్ని మరచిన జీవచైతన్యం తిరిగి తన స్వస్వరూపాన్ని తెలుసుకొనే ప్రయత్నంలో ఆ నిర్గుణస్థితి దిశగా సాగించే ప్రయాణమే తురీయాత్మ పరిణామం.
ప్రతివ్యక్తిలోని జీవాత్మ దైవాంశ సారాంశమే. భగవంతుని యందు మనం ఆపాదిస్తున్న లక్షణాలు, శక్తులు జీవాత్మ తనయందు అంకుర స్థితిలో కలిగి వుంటుంది. పరిపక్వ దిశగా నిరంతరం పొందే క్రమవృద్ధి కారణంగా జీవాత్మ చైతన్యం భగవత్ చైతన్య దిశగా పురోగమిస్తుంది.
ఈ లక్ష్యసాధనలో పయనించే సాథకుడు విశుద్ధ చిత్తతను సంతరించుకొనటానికి దోహదపడే ఉదాత్త భావపరిపుష్టమైన ప్రాథమిక ప్రార్థన, దాని అంతరార్థం - జీవుని ప్రభావితం చేసే సప్తకిరణాలు, వాని విశేషాలు - మూలజాతులు, వారి పరిణామాలు మొదలైన అంశాలను ప్రముఖ దివ్యజ్ఞాన భావ సంపన్నులైన లెడ్బీటర్, అనిబెసెంట్, ఆచార్య తైమిని, ఎర్నెస్ట్వుడ్, జినరాజదాస మొదలైనవారి రచనలు, సద్గురు శ్రీశ్రీశ్రీ శివానందమూర్తి వంటి పెద్దల ప్రవచనాల ఆధారంగా దివ్యజ్ఞాన భావనా మార్గంలో పయనిస్తున్న డాక్టర్ శంకర వెంకట్రావు గారి తొలి తెలుగు స్వతంత్ర రచనను పాఠకులకు అందిస్తున్నాము.
- శ్రీకృష్ణ దివ్యజ్ఞాన సమాజము, గుంటూరు