ప్రశ్నలకు చూడకుండా సమాధానం చెబుతాననీ తాను దైవాంశ సంభూతురాలిననీ చెప్పుకుంటుంది సిద్ధేశ్వరీదేవి. జనం నుంచి లక్షలు వసూలు చేస్తూ మోసం చేస్తూన్న ఆ ''దేవి'' బండారాన్ని బట్టబయలు చేయాలని ప్రయత్నిస్తుంది ఓ యువతి. ఆమె తులసి. ఈ తులసిని ఎలాగైనా కనిపెట్టి చేతబడి చేయాలని దార్కా అనే ఒక మహా మాంత్రికుడు బిస్తా నుంచి బయలుదేరతాడు. సిద్ధేశ్వరిదేవికి ఈ మాంత్రికుడు తారసిల్లుతాడు. అతడిని లోబరుచుకుని జనాన్ని ఇంకా దోచుకోవాలనే కుతంత్రం పన్నుతుంది సిద్ధేశ్వరి. అయితే అనుకోకుండా దార్కా తులసితో చేయి కలుపుతాడు. ఆ తర్వాతి కథ తులసిలో చదవాల్సిందే.

తెలుగునాట సంచలనం సృష్టించిన 'తులసీదళం' నవలకు ఇది కొనసాగింపు. తులసి అనే చిన్నారికి చేతబడి చేసిన కాద్రా క్షుద్రదేవతల మూలాన చనిపోతాడు. దానికి పగ తీర్చుకోవాలనుకున్న విషాచి దార్కాసాహుకు మంత్ర విద్యలు నేర్పుతాడు. అందుకు ప్రతిఫలంగా అతడడిగే గురుదక్షిణ కాద్రా చావుకు కారకులైన ముగ్గురు నాగరికుల ప్రాణాలు. గురువుకు మాట యిచ్చిన దార్కా ఒకే ఒక్క వెంట్రుక సాయంతో ఒకే ఒక్క ఆధారమయిన తులసిని వెదుక్కుంటూ వెడతాడు.

చివరికి ఏం జరిగింది ? దార్కాతులసి స్నేహితులెలా అయ్యారు ? క్షుద్రశక్తులు ఉన్నాయా ? లేవా ? దీనికి సైన్స్‌ ఏం చెబుతోంది ? హేతువాదానికీ చేతబడుల వంటి విశ్వాసాలకీ లంగరు వేసే నవల 'తులసి'. ప్రచురణ - నవసాహితి బుక్‌ హౌస్‌.

Write a review

Note: HTML is not translated!
Bad           Good