ఈ వేయేండ్ల కాలంలో భక్తి ఉద్యమం బహుశా భారతీయ మనస్సు యొక్క మ¬న్నతమైన సృజనాత్మక తరంగంవలె లేచినదని చెప్పవచ్చును. తుకారాం (1608-1650) మహారాష్ట్రలోని ఉదారమైన సంప్రదాయానికి సంక్షిప్తరూపం. కొంతవరకు అతడొక పౌరాణిక చరిత్ర. శూద్రుడుగా పుట్టి, విప్లవాత్మకమైన తన సాంఘికాలోచనలు రోజు రోజుకు జనామోదం పొందుచున్నందున పూర్వాచార పరాయణులచేత హింసింపబడిన తుకారాం తన నిగూఢ పరిసమాప్తి  తర్వాత తన కాలంనాటి మ¬న్నతుడైన మహనీయుడుగా పరిగణింపబడినాడు. ఇప్పటికి మూడు శతాబ్దాలకు పైగా మరాఠీ ప్రజల సాంస్కృతిక జీవనం మీద అత్యధికమైన పలుకుబడిని కలిగి ఉండినాడు. ఇంచుమించు త్రపి తరంలోనూ అతని అభంగ గీతికలను చాలా విస్తృతంగా పాడటం, చదవడం, సామెతలుగా దృష్టాంతీకరిచండం జరుగుతున్నది. బ్రహ్మాండమైన ఆత్మాశ్రయ మతంలో ఉన్నది. అతని నైతికత నేటి కాలానికి ఎంతో సంగతమైనది. ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేసే గంభీర విద్యార్ధి ఎవ్వరు కూడా తుకారామును పరిహరించలేదు. తుకారాం ఆలోచనలలో తెలుపబడి, మరాఠీ మాతృభాషకాని శ్రోతల కొరకు విరివిగా ఉదహరించబడిన తుకారాముని సాంఘిక పూర్వరంగం, అతని జీవితం, అతని అనుభవాలకు సంబంధించిన గంభీర అధ్యయనంతో కూడిన భాలచంద్ర నేమాడే కృత యీ ఏకాంగీ పుస్తకం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good