తెలుగు మాతృభాషగా గల విద్యార్థులకు ఇంగ్లీషు, హిందీ కూడా నేర్చుకోవలసిన అవసరం అధికమవుతుంది. ఎందుకంటే హిందీ జాతీయభాషగా ఉంది. ఇంగ్లీషు అంతర్జాతీయ అనుసంధాన భాష. కేవలం ఉద్యోగాలకోసమే కాక అనేక అవసరాలకు అధునికులు దేశంలో, ప్రపంచంలో పలు భాషలు మాట్లాడే, వివిధ ప్రాంతాలు తిరగవలసి వస్తుంది. అన్ని భాషలు నేర్చుకోవటం వీలు కాదు. అయినా సాధారణ లావాదేవీలు జరుపుకోవటానికి దేశస్థాయిలో హిందీ, ఇంగ్లీషు నేర్చుకోవటం అత్యవసరం అవుతుంది. తరచుగా వాడే కొన్ని మాటలను నేర్చుకోవటం వల్ల పనులు సులువుగా చేసుకోవచ్చు.

    ఈ ఉద్దేశ్యంతో 10,000 తెలుగు మాటలకు ఇంగ్లీషు, హిందీ అర్థాలు, 10,000 ఇంగ్లీషు మాటలకు తెలుగు, హిందీ అర్థాలు, 10,000 హిందీ మాటలకు తెలుగు, ఇంగ్లీషు అర్థాలు లభ్యమయ్యేలా త్రిభాషా నిఘంటువు రూపొందించబడింది. ప్రతి ఒక్కరికీ ఎంతో ఉపయోగపడే నిఘంటువు 'త్రిభాషా నిఘంటువు'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good