ఇంగ్లీషు-హిందీ పదాలకు తెలుగు ఉచ్ఛారణతో
భాష భావ ప్రకటనకు ముఖ్య ఆధారం. మన దేశంలో అనేక భాషలున్నాయి వాటిలో ఇంగ్లీషు అంతర్జాతీయ భాష, హిందీ జాతీయ భాష, తెలుగు తదితర ప్రాంతీయ భాషలు మాతృ భాషలుగా మనకున్నాయి. వీటి తలంభన చేసుకొని, నిత్య జీవితంలో వాడుకలో, విద్యార్జనలో అందరికీ అందుబాటులో ఉండేలా ఈ త్రిభాషా డిక్షనరీని మీకు అందిస్తున్నాము. దీని ప్రత్యేకత దీనిదే పరిశీలించండి. ఆమాట మీరే అంటారు.
హిందీ భాషా ప్రాముఖ్యాన్ని, ఆవశ్యకతను గుర్తించి జాతీయభాషగా ప్రకటించడం జరిగింది. నాటి నుండి దేశ ప్రజలందరూ హిందీ భాష పట్ల ఆదరాభిమానాలు కలిగి దానిని అభ్యసించడం పట్ల మక్కువ చూపుతున్నారు. నేడు హిందీ భాష కేవలం జాతీయ స్ధాయిలోనే కాక అంతర్జాతీయ స్ధాయి వరకు పేరు ప్రఖ్యాతులు గడించింది.
ఆధునిక విజ్ఞాన యుగంలో మన దేశంలో ఎక్కువ మంది ఆంగ్ల భాషా మాధ్యమంగా విద్యనభ్యసించడం గమనార్హం. మారుతున్న పరిస్ధితుల కనుగుణంగా మార్పులు సంతరించుకోవడం సహజమే కదా!
పైన పేర్కొన్న అంశాలన్నింటిని దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాల, విద్యార్ధుల, పిన్నల, పెద్దలందరి కోసం ఈ డిక్షనరీని రూపొందించడం జరిగింది.
భారతదేశంలో ఉన్నత పాఠశాల స్ధాయి వరకు చదివిన హిందీ భాషేతర ప్రాంతాలవారికి మూడు భాషలు సహజంగా తెలుస్తాయి. ఈ సౌలభ్యం భారతీయ విద్యావ్యవస్థలో త్రిభాషా సూత్రాన్ని అమలు పరచడం వల్లనే సాధ్యమౌతుంది. ఈ సూత్రం ప్రకారం మాతృభాష (ప్రథమ భాష), ఇంగ్లీషు మరియు జాతీయ భాష హిందీల బోధన జరుగుతుంది. ఆంగ్లము హిందీతో సహజ భాషగా మనదేశంలో నిలిచిది. ఆ భాషను వదులుకునే స్థితిని మనం దాటిపోయాం. ఇందులకు వివరణ అనవసరం. ప్రస్తుత స్ధితిలో త్రిభాషా వ్యవహార పరిజ్ఞాన పటిష్టత మన అవసరం. భాషకు శబ్ధం ముఖ్యం. శబ్ధానికి అర్ధం ప్రాణం. శబ్ధార్ధాన్ని ఎప్పుడూ తెలియజేయడానికి చేరువలో వుండే సాధనం నిఘంటువు. నేటి మన అవసరం త్రిభాషా నిఘంటువు.  డా|| యం.రంగయ్య, డా|| ఎన్‌.వి.యస్‌.ప్రసాదు గార్లు హిందీ - ఇంగ్లీషు - తెలుగు డిక్షనరీని మనకు అందించి మనల్ని ఋణగ్రస్తుల్ని చేశారు. అందుకు నా హృదయాభినందనలు.

ఈ శబ్ధకోశం ఉభయతారకం. హిందీ భాష నేర్చుకునే తెలుగువారికి తెలుగు మరియు హిందీ సమాసార్థకాలను, ఇంగ్లీషు లేదా తెలుగు నేర్చుకునే హిందీ భాష తెలిసినవారికి ఇంగ్లీషు లేదా తెలుగు శబ్దాల అర్ధాలను హిందీ భాషా శబ్దాల ఆధారంగా చక్కగా తెలియజేస్తుంది. బాగా ఉపయోగపడుతుందని చెప్పడానికి 'ఏమాత్రం' సందేహం లేదు.

అంతేగాక ఈ నిఘంటువు అనుబంధంలో జాతీయాలు, వాని అర్ధాలు వున్నాయి. నిత్యజీవన వ్యవహార సిద్ధ శబ్ధాలను వర్గీకరించి ప్రత్యేకంగా పొందుపర్చారు. విశిష్ట స్ధాయి భాషా సముపార్జనకు ఈ అనుబంధం ఎంతో సహాయకారి. ఆర్ధిక పరిపాలనా రంగాల్లో ప్రసారం పొందిన పారిభాషిక శబ్దాలు వాని సమాసార్థకాలు సామాన్యులకు నిత్య వ్యవహారాలలోనూ, అనువాదకులకు అనువాదానికీ సహకరించే విధంగా ఈ నిఘంటువు నిర్మాణం జరిగింది. ఈ ప్రయత్నం తన ప్రత్యేకతను తనే చాటుకుంటుందని నా విశ్వాసం.

ఈ మంచి కృషికి ప్రచురణ కర్తలకు, ప్రకాశకులకు, సంపాదకులకు నా ధన్యవాదాలు.

డాక్టర్‌ వై.వెంకటరమణరావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good