టాప్ ర్యాంకర్, పుస్తకం బాగుంది. విద్యార్ధులకు ఏంతో ఉపయుక్తంగా వుంటుంది. ఈ రచయితకు పిల్లల పట్ల చాలా మక్కువ వుంది. ఆసాంతం ఒక తండ్రి. తన పిల్లాడికి లేదా ఒక అన్న తన చిన్ని తమ్ముడికి/చెల్లికి ప్రేరణ కల్గించి ఉన్నత స్థాయిలో చూడాలని ఎలా కలలు కంటాడో .. అదే తపన ఈ పుస్తకంలో కనిపించింది. పిల్లలందరికీ తెలివితేటలు సమానంగా ఉన్నా వాటిని సక్రమంగా ఉపయోగించుకున్నవారు టాప్ ర్యాంకర్ అవుతారని, అందుకు విద్యార్దులు విజయ సోపానం అధిరోహించడానికి మార్గం చూపారు. సరళమైన భాష , భావ వ్యక్తీకరణతో , సోదాహరణలతో చదువులో ర్యాంకు తెచ్చు కోవడంతో బాటు నిజాయితీగా ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ప్రస్తుత ప్రపంచీకరణ నేపధ్యంలో విద్యార్ధి స్థాయి నుండి పోటీతత్వం అలవార్చుకోవలసినది. విద్యార్ధులు మార్కులు, ర్యాంకులు తెచ్చుకోవాల్సింది . అయితే గెలుపోటములను సమానంగా స్వేకరించ గలిగే పరిణితి, మానవీయ విలువలు దానికి తెదయితే పూపువు తావి అబ్బినట్లు వారి ప్రతిభాపరిమలాలు సమాజహితానికి దోహదపడతాయి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good