''గతానికి సంబంధించి మారుతోన్న మన చైతన్యం ఆవిష్కరించిన ఈ కథలన్నిట్లోనూ గతం వర్తమానాన్ని శాసించిన విధాన్ని కూడా ఆకళింపు చేసుకోవచ్చు... అనేకానేక సూక్ష్మతలు, పొరలు ఈ కథల్లో ఉన్నాయి. అన్నిటినీ ప్రస్తావించడం సాధ్యం కాదు, భావ్యం కూడా కాదు. ఎవరికివారు చదువుకోవాలిసిందే. కథలన్నిటినీ రచయిత ఎంత ఓర్పుగా తీర్చిదిద్దారో తాజాగా పాఠకులు అస్వాదించాల్సిందే. ఈ సంకలనంలోని పదమూడు కథలూ (ఒక్క 'వార్తాహరులు' తప్ప) ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిషా ప్రాంతానికి సంబంధించినవే. ఈ కథల్ని కథాకాలాన్నిబట్టి కూర్చారు. అందుచేత వీటన్నింటినీ వరసగా చదివితే ఆ ప్రాంతపు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర రేఖామాత్రంగానైనా మనకు గోచరిస్తుంది. ఇంతటి స్థలకాల నిర్దిష్టత, విశిష్టత కలిగిన ఈ కథలు ఇతర భాషా పాఠకులను కూడా చేరాల్సిన అవసరం ఉందని నేను విశ్వసిస్తున్నాను''. - పి.సత్యవతి

పేజీలు : 223

Write a review

Note: HTML is not translated!
Bad           Good