చెవి ముక్కు గొంతు వ్యాధుల వైద్య విభాగంలో మేము చాల తరచుగా చూసే రెండు వ్యాధులు టాన్సిల్స్ మరియు సైనసైటిస్. గొంతు బాధతో వచ్చిన వ్యక్తిని పరీక్షచేసి టాన్సిల్స్ వ్యాధిగా డయాగ్నోసిస్ చేసి సైనసైటిస్ వ్యాధిగా నిర్ధారణ చేసి చెప్పినప్పుడు  ఆ వ్యక్తికీ అనేక సందేహాలు కలుగుతాయి. ఉదాహరణకు టాన్సిల్స్ వ్యాధి అంటే ఏమిటి? అది ఎందుకు వస్తుంది? ప్రమాదకరమైన వ్యధా? మొదలైనవి. అదే విధంగా సైనసైటిస్ గురించి కూడా. వాటి అన్నిటికి సమాధానాలు మౌకిఖంగా చెప్పాలంటే చాల ఎక్కువ టైం తీసుకుంటుంది. అంతే కాకా ఒక్కసారి చెప్తే పూర్తిగా అర్ధంకాక పొవచు. అర్దమైంది కూడా తరువాత కొంత మర్చిపొవచు. అవే సమాధానాలు ఓకే పుస్తక రూపంలో వ్రాసి అందిస్తే వారు ఒకటికి నాలుగు సార్లు చదివి పూర్తిగా అర్ధం చేసుకొంటారు. ఆ ఉద్దేశంతోనే ఈ పుస్తకం వ్రాయటం జరిగింది. ఇందులో టాన్సిల్స్ కు సంబంధించిన మరియు సైనసైటిస్ కు సంబంధించిన విషయ విజ్ఞానమును సామాన్య పాఠకునికి అర్ధమయ్యే విధంగా సరలికరించి క్లుప్తంగా వ్రాసాను. దీనిని చదివి పూర్తిగా అర్ధం చేసుకుంటే టాన్సిల్స్ గురించి, సైనసైటిస్ గురించి ఉన్న సందేహములు చాల వరకు తొలగిపోతాయని భావిస్తున్నాను.

Write a review

Note: HTML is not translated!
Bad           Good