ఈ పుస్తకంలో వర్ణించిన సాహసాలలో చాలామటుకు నిజంగా జరిగినవే. వాటిలో ఒకటి రెండు నా సొంత అనుభవాలు. మిగిలినవి నా సహాధ్యాయుల అనుభవాలు. హక్‌ఫిన్‌ లాంటి బాలుడు నిజంగా ఉండేవడు. టామ్‌సాయర్‌ కూడా అంతే. కాని, టామ్‌ ఒకడు కాదు. నాకు తెలిసిన ముగ్గురు బాలుర గుణగణాలను చేర్చితే టామ్‌ పాత్ర తయారైంది.

ఈ నవలలో పేర్కొన్న చిత్ర విచిత్రమై నమ్మకాలు ఈ కథ జరిగిన రోజులలో - అంటే ఇప్పటికి ముప్ఫయి, నలభై ఏళ్ళ క్రిందట అమెరికా పశ్చిమ రాష్ట్రాలలో పిల్లలోను, బానిసలలోను నిజంగా వుండేవి.

నా పుస్తకం ప్రధానంగా బాలురకు, బాలికలకు వినోదం కోసం రాసినదైనా, ఆ కారణాన పెద్దవాళ్లు దీన్ని చదవడం మానరని ఆశిస్తున్నాను. పెద్దవాళ్ళు తమ చిన్నతనంలో తాము ఎలా వుండేవారో, తమ ఆలోచనలు ఎలా వుండేవో, తాము ఎలా మాట్లాడేవారో, ఏ చిత్రమైన సన్నివేశాలలో తాము చిక్కుకునేవారో వారికి ఆహ్లాదకరంగా జ్ఞాపకం చేయడం కూడా ఈ నవలా రచన ఉద్దేశాలలో ఒకటి. - మార్క్‌ట్వేన్‌

పేజీలు : 152

Write a review

Note: HTML is not translated!
Bad           Good