ఈ కథ 1920 సంవత్సరాలకాలంలో, కిర్గీ జియాలో సోవియట్‌ ప్రభుత్వదం స్థాపితమవుతున్న రోజుల్లో జరిగింది. ఎన్నో ఏళ్ల కిందట, చిన్న కిర్గీజ్‌ కుగ్రామంలో, ఈ కథలో ప్రధాన పాత్రలు - యువతి అల్తినాయ్‌, యువక ఉపాధ్యాయుడు ద్యూయ్‌షేన్‌ - ఒకరినొకరు కలుసుకున్న రోజుల్లో జీవితం ఇంకా పురాతన పితృస్వామిక పద్ధతులలోనే సాగుతూండేది. ఈ పద్ధతులు పధ్నాల్గేళ్ల అల్తినాయ్‌నిపై దు:ఖ భాజనమైన విధిని మోపాయి. లెక్కకుమించిన కిర్గీజ్‌స్త్రీలు ఆనాటివరకూ వెళ్లబుచ్చుతూండి నట్టి జీవితాల్లా, అల్తినాయ్‌ జీవితమూ ఆనంద రహితంగానే గడచివుండేది...కాని అల్తినాయ్‌కి సహాయం చేయడానికా అన్నట్లు, కొమ్‌సొమోల్‌ సభ్యుడు ద్యూయ్‌షేన్‌ ఆ కుగ్రామానికి రావడమే కాకుండా, సోవియట్‌ ప్రభుత్వపు తొలి శాసనాలను తనతోడి గ్రామస్థులకు ఎరుకపరచాడు. ఆ యువతి ఎదుట ఆవిష్కృతమైన నూతన సుఖమయ జీవితమూ, ఆ స్వాతంత్య్ర ప్రియురాలి మనస్సులో నెలకొన్న ఆత్మాభిమానమూ, యౌవన హృదయంలోని కవిత, తొలివలపు - వీటిని గురించి ఈ ముచ్చటితుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good