తెలుగు అక్షరానికి తొలి వెలుగు.

తెలుగు భాష పరిణామ వికాసానికి తొలి అడుగు.

తెలుగు భాషకు రాజభాష హోదాను, శాసనభాషగా ఒక అధికార ప్రతిపత్తి కల్గించి, చారిత్రకంగా, సాహిత్యపరంగా 'ప్రాచీన హోదా'ను అందించిన కీలక ఆధారం. కడపజిల్లా కలమళ్ళ గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో క్రీ.శ. 575లో రేనాటి చోళరాజు ధనుంజయవర్మ వేయించిన శాసనం - కలమళ్ళ శాసనం. 1904లో మద్రాసు శాసన పరిశోధన విభాగం వారు దీనిని గుర్తించారు. 1947-48లో ఆచార్య కె.నీలకంఠ శాస్త్రి, యమ్‌.వెంకటరామయ్య ఈ శాసనాన్ని పరిష్కరించి ప్రచురించారు. ప్రాచీన లిపి ఆధారంగా ప్రప్రథమ తెలుగు శాసనంగా భారతీయ పురాతత్వ శాఖ అంగీకరించింది. ఈ శాసనం పొడవు 42 అంగుళాలు. వెడల్పు 9 అంగుళాలు. ప్రస్తుతం కలమళ్ళ శాసనం ఆచూకీ లభించడం లేదు. చర్చ జరుగుతోంది. రేనాటి చోళుల చరిత్ర, వంశ క్రమము, పరిపాలన, నాటి ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సామాజిక, సాంస్కృతిక అంశాలను కూడా ఈ పుస్తకంలో పొందుపరచడమైంది.

'తెలుగు లిపిలో ఉన్న మొట్టమొదటి శాసనాలన్నీ మనకు రాయలసీమలోనే దొరికాయి. రేనాటి చోళుల మొత్తం శాసనాలలోనూ మొదటిది, ప్రాచీనమైనది, తొలి తెలుగు శాసనం - కలమళ్ళ శాసనం'. - ఆరుద్ర

పేజీలు : 103

Write a review

Note: HTML is not translated!
Bad           Good