తొలి మధ్యయుగ ఆంధ్రప్రదేశ్‌ క్రీ.శ. 624 - 1000 మధ్యకాలం నాటి భౌగోళిక, రాజకీయ, ఆర్ధిక, సాంఘీక, సాంస్కృతిక దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్టు వివరిస్తుంది. ఆయా రంగాలలో సుదీర్ఘ కాలంగా పరిశోధనలు సల్పిన చరిత్రకారులు నేటి వరకు జరిగిన పరిశోధనల ఆధారంగా నాటి చరిత్రను సహేతుకంగా, ప్రామాణికంగా, సాధికారికంగా రచించారు. ఈ యుగంలో రాజకీయ, ఆర్ధిక, సామాజికి, సాంస్కృతిక రంగాలలో గణనీయమైన మార్పు కనిపిస్తుంది. రాజకీయంగా తూర్పు చాళుక్యవంశం ప్రధాన రాజవంశమైనప్పటికీ సామంత ప్రభువులు, చిన్న చిన్న రాజులు ప్రముఖ పాత్ర వహించారు. తెగలు వ్యవసాయాన్ని అవలంబించి సామాజిక ¬దాను పెంచుకొన్నాయి. భూదానాలు, చెరువుల నిర్మాణం, వ్యవసాయాభివృద్ధికి తోడ్పడ్డాయి.

స్ధానిక భాషయిన తెలుగుకు గుర్తింపు ఏర్పడింది. తెలుగులో శాసనాలు వేయడం మొదలయింది. మతపరంగా బౌద్ధం వెనుకంజవేసింది. జైన, శైవ, వైష్ణవాలు విజృంభించాయి. పాశుపత, కాలముఖ, కాపాలికాది మత శాఖల ప్రాముఖ్యం హెచ్చింది. దేవాలయం సమాజంలోని అన్ని రంగాలలోనూ కేంద్ర స్ధానానికి ఎదుగుతూ ఉంది. పంచారామక్షేత్ర భావన నెలకొన్నది.

నాగర, ఫాంసన, ద్రావిడ శైలులతోపాటు స్ధానిక శైలులు కూడా మిళితమై అద్భుతమైన శిల్పవాస్తు కళారూపాల సృష్టి జరిగింది. అలంపురం, బిక్కవోలు, ముఖలింగం, హేమావతి, వేములవాడ ప్రముఖ ఆలయ కేంద్రాలుగా రూపొందాయి. దాదాపు నాలుగు శతాబ్ధాల ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర సంస్కృతులను సమగ్రంగా, ప్రామాణికంగా వివరించే ఈ గ్రంథం తెలుగు వారందరికీ ఆవశ్యపఠనీయం. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good