ధర్మన్న పేరునీ, ఆయన కృషినీ తాటి చెట్టంత లోతున గోతిని తవ్వి గత యనభై సంవత్సరాలుగా పాతి పెట్టారు. ఆ గోతిని మళ్ళీ తవ్వి, అందులో దొరికిన కొన్ని సాహిత్య మాణిక్యాల్ని ఆంధ్ర పాఠకులకి అందించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను. - సి.వి.

శిష్టుల సాహిత్యమూ సంస్కృతీ ప్రధాన స్రవంతిగా భావించడం వల్లా సారస్వత సృజనలో సర్వస్వాన్ని త్యాగం చేసిన ఎందరో దళిత నాయకులు... చరిత్ర పుట్టలోకి ఎక్కకుండానే కాలగర్భంలో కలిసిపోయారు. అది కుసుమ ధర్మన్న కవి గురించి చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. - శిఖామణి

ఈ సంకలనంలో రచయితలంతా ప్రముఖులూ ప్రజ్ఞావంతులుగా పరిచితులైన వారే. ధర్మన్నను కలుసుకున్న తొలితరం కవి రచయిత బోయి భీమన్న జ్ఞాపకాలతో మొదలవుతుంది. కసుమ ధర్మన్న ఇంట్లోనే గుర్రం జాషువాను మొదటిసారి కలుసుకున్నట్టు గుర్తుచేసుకుంటారు భీమన్న. వారిద్దరి కలయికలో ఆ ఇల్లు సాహిత్య చర్చలతో సరస్వతీ విలాసంలా వుండదన్న భీమన్నమాట తనపై పడిన ప్రగాఢ ముద్రను ప్రతిబింబిస్తుంది. ధర్మన్న సమగ్ర వ్యక్తిత్వాన్ని కూడా తొలి దశలోనే చూసిన వ్యక్తిగా భీమన్న చక్కగా చెబుతారు. ఇక తొలిసారి ఆయనపై ఒక గ్రంథమంటూ వెలువరించిన సివి పరిశీలనాత్మక రచనలో భాగాలు చూస్తే ఎలాటి సామాజిక అంతరాల దొంతరల మధ్య ధర్మన్న తన ధర్మయుద్ధం సాగించాడో బోధపడుతుంది. మొదటే చెప్పుకున్నట్టు ఆయనకు సంబంధించిన సాహిత్య వ్యక్తిగత ఆకరాలు దాదాపు అదృశ్యమై పోయిన తీరును సివి అర్థవంతంగానూ ఆగ్రహపూరితంగానూ వివరిస్తారు. దేశభక్త మహాకవి గరిమెళ్ల సత్యనారాయణ మాకొద్దీ తెల్లదొరతనము పాటకూ మాకొద్దీ నల్లదొరతనం అంటూ వర్తమానంలో కుల వివక్షను చీల్చి చెండాడిన ధర్మన్న పాటకూ తేడాలేమిటో సివి బాగా చెబుతారు...

Pages : 215

Write a review

Note: HTML is not translated!
Bad           Good